పూరి జగన్నాథ్ రవి తేజతో చేసేది ఆ సినిమానేనా?

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాస్ మహారాజా రవి తేజకి ఎన్ని హిట్లు ఇచ్చాడో అందరికి తెలుసు ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో రవితేజకు మంచి మాస్ హిట్లు క్లాస్ హిట్లు ఇచ్చాడు ! అటు తరువాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నేనింతే’ ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాలు ప్లాపులుగా మిగిలినప్పటికీ.. వీరి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.

వీటిలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని పక్కన పెట్టేసినా.. ‘నేనింతే’ చిత్రానికి ప్రత్యేకంగా పెద్ద ఫ్యాన్ బేస్ వుంది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రవితేజ నటనకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. రవితేజ ను సడెన్ గా మీట్ అయ్యాడట పూరి. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.’ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఫామ్లోకి వచ్చిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. మరో వైపు తన డ్రీం ప్రాజెక్టు అయిన ‘జన గణ మన’ కు హీరోని వెతికే పనిలో కూడా బిజీగా గడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో రవితేజను కలిసాడు కాబట్టి.. అతనితో ‘జన గణ మన’ సినిమాని తెరకెక్కించాలని పూరి డిసైడ్ అయినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ సంగతి గమనించాలి. ‘జన గణ మన’ ప్రాజెక్టుని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని పూరి భావిస్తున్నాడు. ఇక రవి తేజతో మంచి అనుబంధం ఉండటం వలన పూరి జగన్నాథ్ రవి తేజ తో చెయ్యాలని భావిస్తున్నాడట...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: