ఓ బేబీ ఫేమ్ తేజ సజ్జ.. ఆ ఛాలెంజ్ ఫేస్ చేసాడట..?

praveen
అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమాలో చిన్నప్పుడు చిరంజీవి పాత్రలో నటించిన తేజ సజ్జ  ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే మరోసారి కీలక పాత్రలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో.. మనవడి పాత్రలో నటించిన తేజ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ సినిమాలో నటించిన సమయంలోనే తేజ  రానున్న రోజుల్లో హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావించారు. అనుకున్నట్లుగానే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తేజ సజ్జ  ఇటీవల హీరో గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జాంబి రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో శరవేగంగా చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.

 ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎక్కడ చూసినా కూడా జాంబి రెడ్డి చిత్రబృందం కనిపిస్తుంది. ఇటీవలే మాటీవీలో సుమా  వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే కార్యక్రమానికి జాంబి రెడ్డి చిత్రబృందం వచ్చింది.  ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం వచ్చిన చిత్ర బృందం తమదైన శైలిలో ఎన్నో పంచులతో ఎంటర్టైన్మెంట్ పంచారు.  ఈ క్రమంలోనే సుమ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు అందరూ అంతకంటే ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు. కాగా  నువ్వు లైఫ్ లో ఇప్పటి వరకు ఫేస్  చేసిన పెద్ద చాలెంజ్ ఏంటి అంటూ సుమా  తేజ ను అడగగా... నేను డిగ్రీ పాస్ అయ్యాను అని అదే నాకు పెద్ద చాలెంజ్ అంటుంది సమాధానం చెప్తాడు. దీంతో అందరూ ఒక్క సెకండ్ షాక్ అయ్యి.. తర్వాత నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: