రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసిన ప్రదీప్.. ఎందుకో తెలుసా..?
ఆ పాటతోనే సినిమాకు సూపర్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా కోసం ప్రదీప్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటే జీరో అని తెలుస్తుంది. అదేంటి స్మాల్ స్క్రీన్ పై ప్రదీప్ కు సూపర్ క్రేజ్ ఉందిగా ఆ లెక్కన బాగానే అడగొచ్చుగా అనుకోవచ్చు. తనకు ఇచ్చే రెమ్యునరేషన్ ఏడో సినిమా బడ్జెట్ మీద పెట్టమని ప్రదీప్ చెప్పాడట. అలా సినిమా క్వాలిటీ పరంగా తన రెమ్యునరేషన్ త్యాగం చేశాడట. అయితే సినిమా ప్రాఫిట్స్ లో పర్సెంటేజ్ రూపంలో ప్రదీప్ రెమ్యునరేషన్ అందుకుంటాడని తెలుస్తుంది.
మొత్తానికి మొదటి సినిమా అని ప్రదీప్ బాగానే ఆలోచించాడని అంటున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు ఫాలో అయ్యే సక్సెస్ ఫార్ములాని ప్రదీప్ క్యాచ్ చేశాడు. సినిమా అనుకున్న దాని కన్నా హిట్టైతే రెమ్యునరేషన్ డబుల్ చేసి అడగొచ్చని ప్రదీప్ ఆలోచన కావొచ్చు. అఫ్కోర్స్ సినిమాకు బాగా డబ్బులు వస్తే నిర్మాత కూడా సంతోషంగా ఇచ్చేస్తాడు. మొత్తానికి ప్రదీప్ మొదటి సినిమాతోనే సూపర్ స్ట్రాటజీతో ఉన్నాడని అనిపిస్తుంది. సినిమాకు పాజిటివ్ బజ్ రాగా సినిమా మొదటి టాక్ హిట్టైతే ప్రదీప్ పంట పడినట్టే.