వామ్మో.. శేఖర్ మాస్టర్ మామూలోడు కాదు.. మంచి రసికుడే..?

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో 'ఢీ' ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే 13 సీజన్ ల నుంచి కూడా ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ప్రతి సీజన్లో కూడా సరికొత్త టాలెంట్ ఉన్న డాన్సర్స్ తెర మీదికి వచ్చి టాలెంట్ నిరూపించుకుని  ఇక చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డాన్స్ రియాల్టీ షో 'ఢీ' లో ఉన్న జడ్జ్ శేఖర్ మాస్టర్ కూడా ఒకప్పుడు 'ఢీ' షో లో కంటెస్టెంట్ గానే వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నాడు.




 అయితే ఒకప్పుడు డాన్స్ రియాలిటీ షో 'ఢీ' లో కేవలం డాన్సు పెర్ఫార్మన్స్ లు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం డాన్స్ పర్ఫార్మెన్స్ లతోపాటు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.  ఈ క్రమంలోనే ఇక ప్రతి వారం 'ఢీ' షో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను ఆశ్చర్య పరచడమే కాదు కడుపుబ్బ నవ్వించి  కామెడీ తో ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. కాగా ఇటీవలే డి వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో  విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రోమో కాస్త ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.


 అయితే ఇటీవలే విడుదలైన ప్రోమో లో శేఖర్ మాస్టర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా లోని మధురమే ఈ క్షణమే అనే పాట పై షో లో ఒక కంటెస్టెంట్ ఎంతో హాట్ పర్ఫామెన్స్ చేసి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ రష్మీ తో కలిసి అదే పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక ఇలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో శేఖర్ కాలిపై రష్మి గౌతమ్ కూర్చోగానే అందరూ షాక్  అవుతారు. ఇక  ఇద్దరు కలిసి ఎంతో హాట్ పర్ఫామెన్స్ చేస్తారు. అంతలో కల్పించుకున్న హైపర్ ఆది ఇలా పాటలు పెట్టు కుంటూ పోతే వచ్చే పండక్కి కూడా వీళ్ళ పర్ఫామెన్స్ ఆగదు అంటూ పంచ్ వేయడంతో అందరు నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: