8 సంవత్సరాల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హాట్ బ్యూటీ పూజా హెగ్డే కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ముకుంద సినిమాతో మెగా హీరోలతో జోడీ కట్టిన పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోయింది ఈ అమ్మడు. తన కెరియర్ లో ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో  వరుస అవకాశాలు అందుకోవడమే కాదు మరో వైపు తన ఫిట్నెస్ తో  ప్రేక్షకులందరికి మతి పోగొట్టింది  ఈ అమ్మడు.  ఇక ఇంకో వైపు సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.



 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు అదే సమయంలో బాలీవుడ్ పై  కన్నేసింది అన్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటించింది.  ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో కూడా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తమిళంలో కూడా నటించేందుకు పూజాహెగ్డే సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.



 నిజానికి 2012 సంవత్సరంలో మూగమూడి  అనే తమిళ సినిమా ద్వారానే చిత్రపరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది పూజాహెగ్డే.  ఇక ఆ తర్వాత టాలీవుడ్ లోకి రావడంతో తమిళ సినిమాలు చేయలేదు.  ఇక ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ పూజా హెగ్డే తమిళ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయింది అనేది తెలుస్తుంది. తలపతి విజయ్ తో కలిసి సినిమాలో నటించబోతుందట  పూజా హెగ్డే. విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో పూజా హెగ్డే కన్ఫార్మ్ అయిపోయినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: