శృతి హస్సన్ వల్ల ప్లాప్స్ లో ఈ 5 గురు హీరోలకు హిట్ దొరికిందట..? అది ఎలాగో చూడండి
ముందుగా ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడు. పవర్ స్టార్ క్రెజ్ గురించి కొత్తగా చెప్పాలిసిన పని లేదు. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు హిట్ అయిన, ప్లాప్ అయిన గాని ఆయన రేంజ్ మాత్రం తగ్గదు. వరుసగా పవర్ స్టార్ నటించిన మూడు సినిమాలు ఫ్లాపు అవ్వడంతో, తరువాత తీసిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయింది . శృతి హాసన్ పవన్ కళ్యాణ్ జంట గా నటించిన “గబ్బర్ సింగ్” ఓ రేంజ్ లో హిట్ అయింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా శృతి హాసన్ లక్ ఇచ్చిన హీరోయిన్ అనే చెప్పాలి. ఇలానే జరిగింది. నేనొక్కడినే, ఆగడు సినిమాలు థియేటర్ లో అంతగా నిలదొక్కుకోలేదు. ఈ రెండు ఫ్లాప్స్ తరువాత వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా లో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటించారు.
తాజాగా, రవితేజ “క్రాక్” సినిమా తో మాస్ కామ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్. దాదాపు నాలుగు ఫ్లాపుల తరువాత రవితేజ సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా, రవితేజ శృతి హాసన్ జంటగా నటించిన “క్రాక్” సినిమా మాత్రం థియేటర్ లో మంచి టాక్ తెచ్చుకుంటోంది.రవితేజ కి కూడా శృతిహాసన్ అదృష్ట దేవత అని చెప్పాలి. అలాగే అల్లు అర్జున్ కి కూడా శృతి హాసన్ లక్కీ అనే చెప్పాలి. ఇద్దరమ్మాయిలతో సినిమాల ఫ్లాప్ అయ్యాక, శ్రుతీ హాసన్ తో జంటగా చేసిన సినిమా “రేసు గుర్రం” బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసింది.ఇంకా, నాగ చైతన్య కి కూడా శ్రుతీ హాసన్ కలిసొచ్చింది. ఆటోనగర్ సూర్య, దోచేయ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాక, శృతి హాసన్ తో కలిసి చేసిన “ప్రేమమ్” సినిమా సూపర్ హిట్ అయ్యింది.అలా నాగ చైతన్యకి శృతి హాసన్ కుడా లక్కీ అనే చెప్పాలి. !!