పవన్, క్రిష్ సినిమా పై హల్చల్ అవుతున్న సరికొత్త రూమర్..?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమై మంచి మార్కులు కొట్టేసిన వేణు శ్రీరామ్ దర్శకుడు.. వకీల్ సాబ్ సినిమా ను మొదలుపెట్టి చాలా రోజులే అయినా ఇంకా రిలీజ్ కాకపోవడం అభిమానుల్లో కొంత అసంతృప్తి ని కలగజేస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు జగగకపోయినా ఆ తర్వాత మొదలుపెట్టిన అన్ని సినిమాలకు గుమ్మడికాయ కొట్టేశారు.. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ప్రేక్షకులకు రోజు రోజు కి అసహనం ఎక్కువైపోతుందని అంటున్నారు..
ఇక ఈ సినిమా తర్వాత ఏకే రీమేక్ లో పాల్గొంటున్న పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.. తొలి సినిమా గమ్యంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్.. తొలి సినిమా తోనే ఆయనకు టాలీవుడ్ లో అవార్డుల పంట పండింది.. లైఫ్ గురించి ఈ సినిమా లో ఆయన వర్ణించిన తీరు చూసి టాలీవుడ్ కి టాలెంట్ ఉన్న దర్శకుడు దొరికాడని అనుకున్నారు.. అనుకున్నట్లుగానే రెండో సినిమా వేదం తో మర్చిపోలేని సినిమా చేశాడు.. అల్లు అర్జున్, మంచు మనోజ్ ల కెరీర్ లో నే ఆ సినిమా ది బెస్ట్ సినిమా గా నిలిచిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆ సినిమా తో క్రిష్ పేరు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మారుమోగిపోయింది.. ఈ సినిమా తరువాత క్రిష్ కు టాలీవుడ్ పెద్ద హీరోల దగ్గరినుంచి పిలుపు వస్తునానుకున్నారు కానీ అలా జరగలేదు. వరుణ్ తేజ్ తో కంచె సినిమా చేశాడు.
ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.. బాలకృష్ణ తో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేసి వరుస హిట్లు అందుకున్నాడు.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ను తెరమీద ఆవిష్కరించి ప్రస్తుతం పవన్ తో ఓ పిరియాడికల్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడంతో టైం చాలా దొరికింది.. ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చేయాలనీ భావించి వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు ప్రచారం అవుతుంది.. ఇటీవలే క్రిష్ కి కరోనా రాగా క్రిష్ మూవీ నుండి కొత్త సంవత్సరం కానుకగా కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. దాంతో పవన్.. క్రిష్ ల మూవీ పరిస్థితి ఏంటీ ఎప్పుడు పునః ప్రారంభం అవుతుంది అంటూ వీరి కాంబో మూవీని కోరుకునే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.