మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
తన సహజ నటనతో ఆడియన్స్‌ను మెప్పించి న్యాచురల్ స్టార్ గా పిలవబడుతున్నాడు. 2015 లో వచ్చిన "ఎవడే సుబ్రహ్మణ్యం " 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వరకు వరుసగా ఎనిమిది చిత్రాలు తెలుగు స్క్రీన్పై విజయవంతమయ్యాయి . ఇప్పుడు MCA మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహించారు, దిల్ రాజు నిర్మాత గా ఈ చిత్రం 2017 డిసెంబర్ 21న విడుదలయ్యింది. హీరో నాని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సహజ నటనతో ఆడియన్స్‌ను మెప్పించాడు. సాయిపల్లవి నటన పరంగా ఆకట్టుకుంది. భూమిక పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం 40కోట్ల షేర్ ను వసూల్ చేసి.. నాని కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అయితే MCA చిత్రానికి హీరోగా ఫస్ట్ అనుకున్నది నాని కాదట.
ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే నాని లైన్లోకి వచ్చాడట. ఆ స్టార్ హీరో ఎవరా అని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు మన మాస్ మహారాజ్ రవితేజ. ముందుగా ఈ కథని దర్శకుడు రవితేజకు అనిపిస్తే స్క్రిప్ట్ లో తన ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చెయ్యమని. రవితేజ దర్శకుడు వేణు శ్రీరామ్ ను కోరాడట. అందుకు అలా మార్చేకంటే చిన్న హీరోలతో ఈ సినిమా చేస్తే బెటర్ అని నిర్మాత దిల్ రాజు భావించి రవితేజతో కు ‘రాజా ది గ్రేట్’మూవీ చేయించినట్టు ఇన్సైడ్ టాక్. ఏమైనా రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ కు MCA మూవీ విజయంతో అగ్రహీరోలతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు