అల్లు అర్జున్ మరో రెండు రికార్డులు.. స్టైలిష్ స్టార్ సత్తా ఇది..!

shami
టాలీవుడ్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్న బన్నీ పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేశాడు. ఆల్రెడీ అల్లు అర్జున్ మాస్ మూవీస్ బాలీవుడ్ లో మంచి హిట్ సాధించాయి. ఇక్ అల వైకుంఠపురములో సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా తన క్రేజ్ ఏంటన్నది చూపించాడు.

అల వైకుంఠపురములో సినిమాలో సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ ఆల్ టైం ఫేవరెట్ సాంగ్ గా నిలిచింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ తో ఏ ఇండియన్ సినిమా తెచ్చుకోలేని వ్యూస్ సాధించింది. వరల్డ్ లో టాప్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లో బుట్టబొమ్మ ఒకటిగా నిలిచింది. ఇక 500 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా బుట్ట బొమ్మ సాంగ్ మేకింగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇక ఇదే కాకుండా అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రాం లో 10 మిలియన్ ఫాలోవర్స్ ను తెచ్చుకున్నారు. టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్నాడు. సౌత్ లో ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లిస్ట్ లో 10 మిలియన్స్ సాధించిన క్రేజీ హీరోగా అల్లు అర్జున్ మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: