అలాంటి పిచ్చి వేషాలు వేసిందని ఈ యాంకర్‌కు చిన్నప్పుడే పెళ్లి చేశారట!

kalpana
ఇటీవల రామో గోపాల్ వర్మ చిత్రాల్లో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయిత్రి భార్గవి. ఇటీవల విడుదలైన మర్డర్ చిత్రం.. అదేనండి.. అమృత, ప్రణయ్..  మారుతీ రావు కథ ఆధారంగా కాకుండా.. తీసిన సినిమా మర్డర్. ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించి తన సత్తా చాటింది నటి గాయిత్రి. ఇప్పుడు ఆమె గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.  

యాంకర్ గా, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచుకున్న గాయత్రి భార్గవి గుర్తుండే ఉంటుంది.. అచ్చ తెలుగు అమ్మాయి అంటే ఇలానే ఉంటదేమో అనిపిస్తుంది గాయత్రి భార్గవిని చూస్తుంటే.. సినిమాలలో అవకాశాల కోసం ఎటువంటి అసభ్య సన్నివేశాలకు ఒప్పుకోదు.. ఈమె ప్రముఖ దర్శకులు బాపు గారి మనవరాలు.. నేను ఇండస్ట్రీలోకి వచ్చినపుడు నా గురించి ఎవరికి తెలియదు. నేను బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదు. అలా పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు..

బాపు పేరు వాడుకొని ఎదగాలని కోరుకోవడం మూర్ఖత్వం అని భావించాను. స్వయంకృషితో పెరిగితే అందులో ఉండే తృప్తి మరోదానిలో ఉండదు అని గాయత్రి భార్గవి అన్నారు. తాజాగా కరోనా వైరస్ చిత్రంలో భావోద్వేగమైన పాత్రలో నటించింది. ఈ సందర్భంగా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకొన్నారు. నేను యాడ్ ఫిలింస్ చేయడం ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి, మా తాత గారికి ఇష్టం లేదు.

సినిమాలు, నాటకాలు అంటూ పిచ్చి వేషాలు వేస్తుందని నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. 21 ఏళ్లలోనే నాకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నా భర్త సినిమాలు చేయమని ప్రోత్సహించటం తో మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించాను. చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ పరంగా సెటిల్ అయ్యాను. యాంకర్ గా బిజీ అయ్యాను. చాలా మందికి నేను సినిమాలలో కూడా నటిస్తాను అని తెలియకపోవడంతో మంచి పాత్రలు మిస్ అయ్యాయి. ఇప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయి అని గాయత్రి భార్గవి చెప్పింది. నాకు యాక్టింగ్ అంటే ముందు నుంచి ఇష్టం. యాక్టింగ్ కోచింగ్ కోసం ఎక్కడికి వెళ్ళలేదు. మా ఇంట్లోనే అలాంటి వాతావరణం ఉండటంతో చిన్నప్పటి నుండి యాక్టింగ్ పెద్దగా కష్టంగా అనిపించలేదు అని తన మనసులోని మాటలను పంచుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: