కళ్యాణ్ రామ్ డూ ఆర్ డై.. దిల్ రాజుతో క్రేజీ ప్రాజెక్ట్..!

shami
నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఇయర్ మొదట్లో వచ్చిన ఎంతమంచి వాడవురా సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఓ సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్  దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. నూతన దర్శకుడు వశిష్ట డైరక్షన్ లో కళ్యాణ్ రామ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా కూడ డూ ఆర్ డై అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. వరుస సినిమాలు చేస్తున్న దిల్ రాజు ఈ సినిమాను కూడా క్రేజీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
కళ్యాణ్ రామ్ 118 తర్వాత మళ్లీ ట్రాక్ తప్పాడు. అందుకే ఇక మీదట కథల మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. డూ ఆర్ డై కథకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. తప్పకుండా కళ్యాణ్ రామ్ , దిల్ రాజు కాంబో క్రేజీ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈమధ్యనే ప్రయోగాలకు సై అంటున్న కళ్యాణ్ రామ్ ఇక మీదట ఫోకస్ అంతా హిట్టు కథల మీద పెడుతున్నట్టు తెలుస్తుంది.  మరి నందమూరి ఫ్యాన్స్ ఆకలి తీర్చే సూపర్ హిట్ సినిమాను కళ్యాణ్ రామ్ తీస్తాడని ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాను కూడా కళ్యాణ్ రామ్  వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉంటాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: