ఆచార్య కోసం ఆ బ్యూటీ రంగంలోకి దిగేది అప్పుడేనట ....??

GVK Writings
గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ అద్భుత నటన కనబరిచారు. ఇక దాని అనంతరం ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో గ్రాండ్ లెవల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ ని అలానే తిరు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని దేవాలయ భూముల కుంభకోణాల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు కొరటాల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా యువ నటి రష్మిక మందన్న నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఆమెకు సంబంధించిన పార్ట్ చిత్రీకరించాల్సి ఉందని అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడటంతో జనవరి చివర్లో నిర్వహించనున్న తదుపరి షెడ్యూల్ లో అమె జాయిన్ కానుందని అంటున్నారు. ప్రస్తుతం రష్మిక, అల్లు అర్జున్ పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది మహేష్ సరసన ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు, అలానే నితిన్ సరసన నటించిన భీష్మ సినిమాలు రెండూ కూడా సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం నటిస్తున్న పుష్ప, ఆచార్య సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకుని  ఆమెకి మరింత మంచి పేరు తెచ్చిపెట్టడం ఖాయం అని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: