ఈ టైం లో సత్యదేవ్ ఇలాంటి రిస్క్ లు చేయడం అవసరమా..?

P.Nishanth Kumar
ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే చాలా ఓర్పు, సమయం ఉండాలి. రాత్రికి రాత్రి ఓవర్ నైట్ ఎవరు అయిపోలేరు.. చిరంజీవి దగ్గరినుంచి నిన్నటి విజయ్ దేవరకొండ దాకా ఎవరు ఓవర్ నైట్ స్టార్ లు అయిపోలేదు.. మంచి సమయం కోసం సరైన సినిమా కోసం వారు వేచి చూశారు.. అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా ఎదో ఒక సినిమా చేస్తూ నెట్టుకొచ్చారు.. అయితే అలానే ఇప్పుడు ఓ యువహీరో టాలీవుడ్ లోకి దూసుకొచ్చాడు. అతనే సత్యదేవ్.. పూరి జగన్నాధ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే సత్యదేవ్ ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా లో నటించి పెద్ద హిట్ కొట్టాడు..
మొదటి నుంచి హీరో గా కనిపించలేదు సత్యదేవ్.. మొదట్లో హీరో ఫ్రెండ్స్ పాత్రలు చేశాడు.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ జ్యోతి లక్ష్మి సినిమా లో హీరో గా నటించాడు.. సత్య దేవ్ కి పేరు తెచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్.. అందులో సెకండ్ హీరో పాత్ర చేసి అందరి ద్రుష్టి లో పడ్డాడు.. ఆ వెంటనే బ్లఫ్ మాస్టర్ సినిమా తో హీరో గా సెటిలయిపోయాడు..అతని నటన కు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.. దాంతో సత్యదేవ్ నిహీరో గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు..
ఒక్కో సినిమా చేస్తూ హిట్ కొడుతూ ముందుకెళుతున్న సత్యదేవ్ ఇటీవలే గువ్వా గోరింకా అనే సినిమా ని అమెజాన్ లో రిలీజ్ చేశాడు. మోహన్ బమ్మిడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం పూర్తైన ఈ సినిమా ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏమాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ఫలితాన్ని సత్యదేవ్ లైట్ తీసుకున్నప్పటికీ 'గువ్వ గోరింక' ఫ్లాప్ క్రెడిట్ మాత్రం సత్యదేవ్ కే అంటగట్టేస్తున్నారు.ఇలానే మరో రెండు ఫ్లాపులు గనుక సత్యదేవ్ కి వస్తే అతని కెరీర్ ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావచ్చని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా సత్యదేవ్ ప్రస్తుతం 'తిమ్మరుసు' అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో సత్యదేవ్ సరసన 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది. అలానే మిల్కీ బ్యూటీ తమన్నా తో కలిసి సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: