బిగ్ బాస్ 4 : ఏంటీ విన్నర్ అభిజీత్ కాదా ...... ఆ కంటెస్టెంటా .....??
ఇక కొన్ని అనధికారిక సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్ ద్వారా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఆల్మోస్ట్ ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలవనున్నట్లుగా సమాచారం. అయితే రెండు రోజుల క్రితం మాత్రం ఒక వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయింది. దానిని బట్టి మూడో రోజూ అలానే నాలుగోరోజు కొద్దిసేపు అరియానా కి ఒకింత భారీ స్థాయి ఓటింగ్ అయితే నమోదయిందని ఆ సమయంలో ఆమె అభిజీత్ కి దగ్గరగా ముందు స్థానంలో కొనసాగిందని సమాచారం. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా అభిజిత్ పుంజుకోవడం ఆపై అరియానా వెనకబడటం జరిగిందని అంటున్నారు.
దానితో రెండు, మూడు స్థానాల విషయమై అటు అరియానా, ఇటు సోహెల్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం జరిగిందని మొత్తంగా వారిద్దరిలో ఎవరో ఒకరు రెండువ స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఆఖరి 4, 5 స్థానాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అఖిల్, హారిక నిలుస్తారని ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు అనధికారికంగానే కాకుండా అధికారికంగా కూడా భారీస్థాయి ఓటింగ్ ని అభిజీత్ దక్కించుకున్నట్లు పలువురు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సస్పెన్స్ అంతటికీ తెర పడాలి అంటే మరి కొన్ని గంటల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!