వామ్మో.. 'ఢీ' షో కొత్త సీజన్ లో ఎన్ని మార్పులు చేశారు.. అంతా తారుమారు..?

praveen
ఈ మధ్యకాలంలో బుల్లితెర షో లకి క్రేజ్  రోజురోజుకు పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే ఎక్కువగా క్రేజ్ ఉండేది కానీ ప్రస్తుతం బుల్లితెరపై కొత్త కొత్త షో లు వస్తూ ఉండడం ఆ షో లు  వినూత్నమైన కామెడీ తో కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండడంతో రోజు రోజు బుల్లితెర పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగి పోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ  కి ఎంతో క్రేజ్ ఉంది. దాదాపు 13 ఏళ్ల నుంచి ఢీ షో  ఎంతో సమర్థవంతంగా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఒక సాదాసీదా డాన్స్ షో గా మాత్రమే ఉండేది కానీ ప్రస్తుతం మాత్రం ఏకంగా కామెడీ షో లను మించి  ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.




 ఇక ప్రతి వారం కూడా ఢీ షో  ఓవైపు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్య పరిచయంతో పాటు మరోవైపు అదిరిపోయే కామెడీ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను అందర్నీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉంది అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఢీ ఛాంపియన్స్ కి సంబంధించిన సీజన్ ముగిసింది. గత సీజన్ లో పియుష్  విజేతగా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఢీ షో 13వ సీజన్ సిద్ధమైంది.  గత సీజన్లో ఓవైపు హైపర్ ఆది వర్షిని లు టీం లీడర్ గా ఉంటే మరోవైపు సుడిగాలి సుదీర్ టీం లీడర్ గా ఉండగా వీరిద్దరి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచారు. కానీ ఈ సారి మాత్రం కింగ్స్  వర్సెస్ క్వీన్స్ అనే ప్రోమో ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 ఇక 13వ సీజన్ లో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ ఒకవైపు టీం లీడర్ గా ఉండగా మరోవైపు రష్మీ తో పాటు కొత్త అమ్మాయి టీం లీడర్ గా వచ్చింది...  ఇలా 13వసీజన్లు నిర్వాహకులు ఎన్నో రకాల మార్పులు చేసి మరోసారి విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ను బుల్లితెర ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనా ప్రస్తుతం ఢీ షో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అని అర్థమవుతుంది. ఇటీవలే విడుదలైన ప్రోమో చూస్తే మాత్రం ఈసారి డాన్స్ పర్ఫార్మెన్స్ లు అదిరిపోయేలా ఉండడంతో పాటు మరోవైపు ఎంటర్టైన్మెంట్ కూడా అంతకు మించి అనే రేంజ్లో ఉండబోతుంది  అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: