ఫైటర్ మూవీ మొదలుకాకపోవడానికి కారణం ఏంటి..?

P.Nishanth Kumar
టాలీవుడ్ లో అతితక్కువ సమయంలో స్టార్ హీరో అయిన నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో తన పదో సినిమా చేస్తున్నాడు.. అయన కెరీర్ లో ఎప్పటికి నిలిచిపోయే సినిమా అర్జున్ రెడ్డి కాగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడనేది వాస్తవం.. ఈ సినిమా తర్వాత పెళ్లి చూపులు తో హీరో గా పరిచయమై టాలీవుడ్ దృష్టి ని ఆకర్షించాడు.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా  ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే..ఇదే హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా..
ఓవర్ నైట్ లో చిన్న సినిమాలు చేసే విజయ్ ని స్టార్ హీరో చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమా వల్ల ఎక్కువ లాభపడింది నిర్మాత అనేకంటే విజయ్ దేవరకొండ అని చెప్పాలి.. దీనికి విజయ్ పడే కష్టం విజయ్ పడ్డాడు.. విజయ్ వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ లతో  టాప్ ప్లేస్ ని అయితే సంపాదించుకున్నాడు.. అందుకే టాప్ డైరెక్టర్ లు సైతం అయన తో సినిమాలు చేయాలనీ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాధ్ తో ఓ సినిమా చేస్తున్నాడు..
కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. లాక్ డౌన్ కు ముందు ఆగిపోయిన సినిమాలన్నీ దాదాపుగా సెట్స్ పైకి వెళ్లాయి. నెలల తరబడి వేచి చూసిన ఆచార్య కూడా వేగమందుకుంది. కానీ విజయ్ మూవీ మాత్రం ఇంకా ఇంచు కూడా కదలడం లేదు. సినిమాలోని కొన్ని కీలక భాగాలు బ్యాంకాక్, అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. అంతే కాదు ఇక్కడే ప్లాన్ చేసిన షెడ్యూల్స్ లో కూడా విదేశీ ఫైటర్ల ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మార్చడానికి లేనివి. స్క్రిప్ట్ అలా రాసుకున్నారు. అందుకే ఎంత లేట్ అవుతున్నా అంతర్జాతీయ ప్రయాణాల పరంగా ఇంకా కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో రౌడీ హీరోతో పాటు పూరి కూడా ఎలాంటి రిస్కు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: