జబర్దస్త్ లో ఆది స్కిట్ అదిరింది.. జారుడే.. జారుడు.?
అయితే ప్రస్తుతం జబర్దస్త్ ని కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం మాత్రమే కొంత మంది ప్రేక్షకులు చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి వారం కూడా సరి కొత్త స్కిట్ లతో హైపర్ ఆది ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటాడు. ఇక తన టీం లో ని ప్రతీ మెంబెర్ ని కూడా ఎంతగానో ఉపయోగించు కుంటూ వారిపై పంచులు వేస్తూ హైపర్ ఆది ఎంటర్టైన్మెంట్ తో కడుపుబ్బా నవ్విస్తుంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలో ఆయిల్ పై స్కిట్ చేయడం ఎంతో ఫేమస్ అయింది అన్న విషయం తెలిసిందే. ఏ ఈవెంట్ లో చూసిన ఇలాంటి కామెడీ స్కిట్ ఒకటి కనిపిస్తుంది.
ఇక ఇటీవలే హైపర్ ఆది టీం జబర్దస్త్ లో ఇలాంటి తరహా స్కిట్ చేసింది. ఇటీవలే జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో హైపర్ ఆది మరోసారి కొత్త స్కిట్ తో తెర మీదికి వచ్చాడు. ఒక ఆయిల్ స్కిట్ చేశారు అందరూ కూడా. ఈ క్రమంలోనే హైపర్ ఆది స్కిట్ ప్రోమో లో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తుంది. స్కిట్ మొత్తం కమెడియన్స్ అందరూ జారీ పడుతూ ఉంటే జడ్జీలు పగలబడి నవ్వారు ఇక ఈ స్కిట్ మొత్తం జారుడే జారుడు అన్న విధంగా ఉంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.