ఈసారి ఆయన పెన్ .... గన్ లా దూసుకెళ్లడం ఖాయమట ....??
ఇక అక్కడి నుండి వరుసగా ఛాన్స్ లతో దూసుకెళ్లిన త్రివిక్రమ్, కెరీర్ లో ఆపై ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ తో అరవింద సమేత, అలానే అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాలు తీసి వాటితో మరొక రెండు భారీ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్, అతి త్వరలో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించనుందని, అలానే మంచి పొలిటికల్, సెటైరికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇకపోతే దీని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వీరిద్దరి కాంబో సినిమాకి సంబంధించి కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ అదిరిపోతుందని, అలానే ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కూడా సూపర్ గా పేలుతాయని అంటున్నారు. మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు టాక్. మొత్తానికి దీనిని బట్టి చాలా గ్యాప్ తరువాత సూపర్ స్టార్, మాటల మాంత్రికుడి కాంబినేషన్ లో సూపర్ ఎంటర్టైనర్ రానున్నట్లు తెలుస్తోంది....!!