చిరు తో సినిమా చేస్తే మెహర్ ట్రెండింగ్ లో నిలిచిపోయాడే..?

P.Nishanth Kumar
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు.. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు. చిరు రికమెండేషన్ తో ఈ సినిమా ని మణిశర్మ తో చేస్తున్నాడు కొరటాల శివ

తాజాగా సమాచారం ప్రకారం చిరు మరొక రీమేక్ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.  రీ ఎంట్రీకి ఎంచుకున్న ఖైదీ నెంబర్ 150 అరవం నుంచి తీసుకొచ్చిన కత్తి. త్వరలో మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన తమిళ మూవీని రీమేక్ చేయడం గురించి ఇప్పటికే మిశ్రమ స్పందన ఉంది.అలాగే  మలయాళం లూసిఫర్ రీమేక్ కోసం వివి వినాయక్ రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడైనా మెహర్ అనే పేరు కనిపిస్తే అది ‘శక్తి’ లాంటి సినిమాల గురించి ట్రోల్ చేయడానికి తప్పితే.. మరో కారణంతో కాదు. ‘షాడో’ తర్వాత అతను ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయినట్లే కనిపించాడు.

ఏ సందర్భంలోనూ ఎవరూ మెహర్‌ను పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ శుక్రవారం మెహర్ రమేష్ పుట్టిన రోజు సందర్భంగా అతడి పేరు మీద హ్యాష్ ట్యాగ్ హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలందరూ వరుసబెట్టి అతడికి విషెస్ చెప్పేస్తున్నారు. అతడిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మెహర్‌తో ఉన్న ఫొటోలు పెట్టి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదంతా చిరంజీవి సినిమా మహిమ. చిన్న హీరోలు కూడా పట్టించుకోని మెహర్‌ను చిరు పిలిచి సినిమా చేసే అవకాశం ఇవ్వడం ఎవ్వరూ ఊహించనిది దీంతో మెహర్ పోగొట్టుకున్న స్టార్ డం అంతా ఒక్కసారి గా తెచ్చుకున్నట్లయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: