ప్చ్ ..... తీవ్ర నిరుత్సాహంలో ఆ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ....??

GVK Writings
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  అతి త్వరలో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాపై ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల వరుసగా మూడు విజయాలు అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ దీనితో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. తొలిసారిగా మహేష్ బాబు సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో ఆయనకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయి మంచి క్రేజ్ దక్కించుకుంది. నిజానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే అమెరికాలో ప్రారంభం అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో యూనిట్ దానిని మరొక రెండు నెలలపాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ కొంత నిరుత్సాహం చెందుతున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, టీజర్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో అని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఈవిధంగా వాయిదాల పర్వం కొనసాగుతూ మమ్మల్ని నిరుత్సాహానికి గురి చేస్తోంది అంటూ పలువురు మహేష్ అభిమానులు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సినిమా పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల మగువ మగువ అనేటువంటి పల్లవితో సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన ఆదరణను చూరగొంది. ఇకపోతే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎప్పటినుండో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వస్తుందని వారు ఆశిస్తున్నప్పటికీ కూడా మూవీ యూనిట్ నుండి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. దానితో రాబోయే దీపావళి పండుగ నాడు అయినా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అవుతుందా లేదా అంటూ పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ నిర్మాత, దర్శకులను ఉద్దేశించి తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు కొంత నిరుత్సాహం లో ఉన్నారు అని చెప్పక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: