నెట్టింట్లో వైరల్ అవుతున్నరామ్ చరణ్ బతుకమ్మ డాన్స్ వీడియో...!!
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇంతకు ముందు చరణ్ అత్తవారింటికి బతుకమ్మ పండుగకు వెళ్లినప్పుడు అక్కడున్న వారితో కలిసి డాన్స్ చేశాడు. చిన్నారులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నాడు చరణ్.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియో పాతదే అయిన తాజాగా వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఈ వీడియోని చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక రీసెంట్‌గా రీస్టార్ట్ అయిన rrr సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
ఇటీవల కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసిన ఎన్టీఆర్ ఇంట్రో వీడియో టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. ఇక ఈ టీజర్ లో రాం చరణ్ వాయిస్ ఓవర్ హైలైట్ గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ టీజర్ ని విడుదల చేయగా.. తెలుగు కన్నా.. చరణ్ హిందీ డబ్బింగ్ చాలా అద్భుతంగా ఉందని బాలీవుడ్ నటీ, నటుల నుంచి మన చెర్రీ వాయిస్ ఓవర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.RRR తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చెర్రీ నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి..!!