రేపు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ నుండి భారీ అప్ డేట్ ...??
కాగా మరొక నటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇకపోతే దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్న సినిమాకు సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాని ఒక పొలిటికల్ సెటైరికల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్లు టాక్.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి రేపు దసరా పండుగ కానుకగా ఒక భారీ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ వారు తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక భారీ అప్డేట్ కు సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కాగా కొద్ది సేపటి నుండి ఆ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది. అయితే రేపు రాబోయేది ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిందే అంటూ దానిపై పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రేపు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ బయటకు రానుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు...!!