ఏంటీ ..... ప్రభాస్ తో వర్షం నిర్మాత సినిమా ఫిక్స్ అయిందా .....??
ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్ కెరీర్ లిస్ట్ లో ఇప్పటికే నాగ అశ్విన్ అలానే ఓం రౌత్ వంటి ప్రఖ్యాత దర్శకుల సినిమాలు ఉన్నాయి. కాగా రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోగా దానిని వచ్చే ఏడాది వేసవి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని తరువాత వైజయంతి మూవీస్ నిర్మించనున్న సినిమాలో ప్రభాస్ నటించనున్నారు. ఇప్పటికే ఆ సినిమా కోసం యూనివర్సల్ సైన్స్ ఫిక్షన్ సబ్జక్ట్ ని దర్శకుడు నాగ అశ్విన్ సిద్ధం చేయగా, దానితో పటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, ప్రభాస్ తో ఆదిపురుష్ అనే భారీ హైస్టారికల్ మూవీ ని తీయనున్నారు.
ఇక వీటి అనంతరం తనతో గతంలో వర్షం వంటి సక్సెస్ఫుల్ సినిమా తీసిన ఎం. ఎస్. రాజు నిర్మాణ సంస్థైన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నారని, ఇటీవల ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ఆయన ఒక ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని అంటున్నారు. ప్రభాస్ కోసం ఇప్పటికే ఒక యువ దర్శకుడి నేతృత్వంలో ఒక అద్భుతమైన స్టోరీని రెడీ చేయిస్తున్న రాజు, ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి అయిన వెంటనే దానిని పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే, దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే...!!