హలొ .... అతిగా ఎగ్జైట్ అయితే .... అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త ....??

GVK Writings
ఇప్పటికే కరోనా మహమ్మారి వలన దేశవిదేశాల్లో ఉన్న అన్ని రంగాలు కూడా ఎన్నో లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి కారణంగా మన దేశంలో కూడా దాదాపుగా ఆరు నెలల వరకు లాక్ డౌన్ విధించడంతో పలు రంగాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలానే ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వారి ఆదాయం కూడా పూర్తిగా పడిపోయి వారు కూడా ఎన్నో అవస్థలు ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇక ఇటీవల మెల్లగా లాక్ డౌన్ ను విడతలవారీగా ఎత్తివేస్తూ వస్తున్న మన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చింది. ఇటీవల సినిమా షూటింగులు కూడా ప్రారంభం అవడం అలాగే అతి త్వరలో సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కానుండడంతో పలువురు సినీ ప్రముఖులు,సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రానున్న మరో ఐదు రోజుల్లో సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్ లు కూడా ఓపెన్ కానుండటంతో ఆరు నెలల నుంచి తామందరం ఎదుర్కొన్న సమస్యలకు మోక్షం కలగనుందని, లాక్ డౌన్ కారణంగా మధ్యలో ఎంతో గ్యాప్ రావడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు సినిమాలు చూడటానికి తరలి వస్తారని, తప్పకుండా తమకు భారీ స్థాయిలో లాభాలు వస్తాయని పలువురు థియేటర్ల యజమానులు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయమై మరికొందరు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచదేశాలను వదల్లేదనేది అందరికీ తెలిసిందే అని, మన దేశంలో రోజురోజుకు ఇది ఇంకా విస్తరిస్తూ ఉండడంతో ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు ఎంతవరకు సినిమా చూడటానికి వస్తారు అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా మనం అనుకున్నది ఒక్కోసారి తలక్రిందులయి అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం కూడా ఉందనేది వారి వాదన. ఒక రకంగా వారు చెప్పింది కూడా నిజమేనని ఉన్నపళంగా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా లేదా అనేది విషయం పక్కన పెడితే కొంత వరకు రాకుండే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరి మరొక ఐదు రోజుల్లో థియేటర్స్, మల్టీప్లెక్స్ లు తెరుచుకోనుండడంతో ఎంత వరకు ప్రేక్షకులు థియేటర్లకు సినిమాలు చూడటానికి తరలివస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: