ఛీ, ఛీ ..... అటువంటి వాళ్ళ వల్లనే సినిమా ఇండస్ట్రీ సగం నష్టపోతోంది .....??

GVK Writings
కాలం మారుతోంది, అలానే రానురాను మనిషి ఆలోచనలు మారుతున్నాయి. దానితో పాటు టెక్నాలజీ వంటివి కూడా సరికొత్త పుంతలు తొక్కుతూ దూసుకుపోతున్నాయి. అంతేకాదు ఆ టెక్నాలజీని వినియోగించుకునే మానవుడు ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతూ తన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ గడుపుతున్నాడు. అయితే అదే టెక్నాలజీని కొందరు వ్యక్తులు తప్పుడు దారిలో వినియోగించి కొంత నష్టాన్ని కూడా చేకూరుస్తున్నారు.
ఇక ఈ టెక్నాలజీని అడ్డుపెట్టుకొని ఇటీవల సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న నష్టం నిజంగా వర్ణింపనలవి కానిది అని పలువురు సినీ ప్రముఖులు వాపోతున్నారు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం విసిఆర్ లు వంటి వాటి ద్వారా కొత్త సినిమాలు అక్కడక్కడా ప్రసారం చేసేవారని, అయితే అనంతరం కాలంలో సిడి లు డివిడిలు రంగప్రవేశం అనంతరం ఈ పైరసి మరింత పెరిగిందని ఇక నేటి సూపర్ ఫాస్ట్ కాలంలో అది మరింతగా విస్తరించి వైరస్ ల కంటే ఘోరమైన స్థితిలో వ్యాప్తి చెందుతుందని వారు అంటున్నారు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే కేవలం కొన్ని గంటల్లోనే దాని యొక్క మంచి క్వాలిటీ ప్రింట్ ని పలువురు వ్యక్తులు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తూ ఆయా సినిమాల నిర్మాతలకు భారీ నష్టాన్ని కలుగజేస్తున్నారని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము సహా ఎందరు పోలీసులు, నిఘా వర్గాలు ఇటువంటి నీచుల పై ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోతోందని, రోజులు మారుతూ కాలం గడుస్తున్న కొద్దీ ఈ నష్టం అంచనా మరింత ఎక్కువగా పెరుగుతోందని ఇకపైన రాబోయే రోజుల్లో పలు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రం ఈ పైరసీ భూతం విషయమై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి తప్పుడు చర్యలకు పాల్పడే వారికి గట్టి శిక్ష విధిస్తే కొంతవరకు దీనిని అరికట్టేవచ్చని ఆ విధంగా కొంతైనా సినిమా పరిశ్రమ బ్రతుకుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: