NTR30 కి అంతా సిద్ధం చేసిన త్రివిక్రమ్...!
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కరోనా ప్రభావం వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో, అతి త్వరలో మళ్ళీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక తాజాగా ఒక్కొక్క హీరో కరోనా పరిస్థితులని ఎదురించి షూటింగ్స్ కి బయలుదేరుతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr షూటింగ్ లో రామ్ చరణ్ కన్నా ముందు ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడట. రాజమౌళి సినిమాతో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కూడా చెయ్యాల్సి ఉంది.ఎన్టీఆర్ rrr మూవీలో నటించడం, తివిక్రమ్ కి అలా వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఉండడంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై భీబత్సమైన అంచనాలున్నాయి.
అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి ఎన్టీఆర్ కి వినిపించాడని.. ఎన్టీఆర్ కూడా స్వామి చెప్పేదానికి ఎలాంటి మార్పులు చెప్పలేదని తెలుస్తుంది. త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్ ని మిగతా స్టార్ కాస్ట్ ని వెతికే పనిలో ఉన్నాడని అంటున్నారు.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు నటించే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా రష్మీక, పూజా హెగ్డే ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరి లో త్రివిక్రమ్ ఎవరిని తీసుకుంటాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.మొత్తానికి ఎన్టీఆర్ కోసం మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సర్వం సిద్ధం చేసాడట. ఇక తారక్ రావడమే తరువాయి... షూటింగ్ మొదలు పెడతాడట త్రివిక్రమ్...!!