రౌడీ హీరో కొత్త రికార్డ్.. సౌత్ ఇండియాలో మొదటి హీరో..?

praveen
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. ఇక మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించి... అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. ఇక అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత గీత గోవిందం సినిమా తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి...100 కోట్ల క్లబ్బులో చేరిపోయాడు విజయ్ దేవరకొండ.




 ఇక ఆ తర్వాత  విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఎందుకో  విజయ్ దేవరకొండ సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి  అని చెప్పాలి. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ తో రౌడీ హీరో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు అనే టాక్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ.. తన మాటలతో ఎంతో మంది యువతను ఆకర్షిస్తూ ఉంటాడు.




 అయితే స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి  విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ రికార్డు సృష్టిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి రికార్డ్  సాధించాడు విజయ్ దేవరకొండ. తన ఇంస్టాగ్రామ్ లో విజయ్ 9 మిలియన్ ఫాలోవర్స్  మార్క్  దాటాడు. సౌత్ ఇండియా మొత్తంలో 9 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ కావడం గమనార్హం. ఇంస్టాగ్రామ్ లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇంత  మంది ఫాలోవర్స్ ను సంపాదించటం అంటే రికార్డు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: