నాని అన్ని సినిమాలు ఓ లెక్క ఇది ఒక లెక్క..?

shami
నాచురల్ స్టార్ నాని వి సినిమా ఫలితం నిరుత్సాహపరచింది. ఈ సినిమాలో నాని విలన్ గా నటించడం సినిమాపై అంచనాలు పెంచినా సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహపడ్డారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు నాని. నిన్నుకోరి తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో నాని చేస్తున్న ఈ సినిమాపై అచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ఓ పురాతన కోట కహానిలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నాని పాత్ర హైలెట్ గా ఉంటుందట.. పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని అంటున్నారు. నాని ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా ఓ లెక్క అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ రోల్ లో అలరిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, రష్మిక ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో వారి పాత్రలు కూడా అలరిస్తాయని అంటున్నారు.
నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని  చెబుతున్నారు. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. అంతేకాదు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాని చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సినిమా అంచనాలకు తగినట్టు ఉంటే మాత్రం తప్పకుండా నాని రేంజ్ ను పెంచే సినిమా శ్యామ్ సింగ రాయ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: