పాపం.... ఆ దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇస్తారా....??
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కేఎస్ రవికుమార్ మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం. తొలిసారిగా 1999లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన స్నేహం కోసం సినిమా కు దర్శకత్వం వహించి మంచి పేరు దక్కించుకున్నారు రవికుమార్. ఆ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ పోషించగా విజయ్ కుమార్, సితార, ప్రకాష్ రాజ్, మీనా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దాని అనంతరం కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సిమ్రాన్, రీమాసేన్ హీరోయిన్లుగా 2001లో తెరకెక్కిన బావ నచ్చాడు సినిమాకు దర్శకత్వం వహించిన కె.ఎస్.రవికుమార్ ఆ సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్న రవికుమార్ అతి త్వరలో మెగాస్టార్ ను కలిసి దానిని వినిపించాలని ప్లాన్ చేస్తున్నారట. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా పలు ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ హంగులు కలబోతగా తాను రాసుకున్న ఈ సినిమాని మెగాస్టార్ తప్పక అంగీకరిస్తారని భావిస్తున్నారట రవికుమార్. మరోవైపు ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి అతి త్వరలో లూసిఫర్ తెలుగు రీమేక్ అలానే వీరం రీమేక్ సినిమాల్లో కూడా నటించనున్నారు. మరి ప్రస్తుతం వరుసగా సినిమాలు ఒప్పుకున్న ఈ పరిస్థితుల్లో రవికుమార్ సినిమాని మెగాస్టార్ ఎంత వరకు ఒప్పుకుంటారో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!