ఆలియా భట్ పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
ఇక ఆలియా భట్ సినిమా యూనిట్ తో నవంబర్ లో కలుస్తుందని సమాచారం. ముందుగా రాజమౌళి.. ఎన్టీఆర్ పై సోలో షాట్స్ తీసి అతనికి సంబంధించిన టీజర్ ను రెడీ చేసి విడుదల చేయించాలి అనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. కానీ ఇప్పుడు ఆలియా ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తుంది.చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ పెట్టిన కండిషన్స్ రాజమౌళిని కన్ఫ్యూజన్ లో పడేసి టెన్షన్ పెడుతున్నాయని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఈ సినిమాలో ఆలియా కి సంబంధించిన సీన్స్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కాని పూణె షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కుదరనే లేదు.
కాగా ఇప్పుడు ఆలియా అక్టోబర్ నుండీ 'ఆర్.ఆర్.ఆర్' కు డేట్స్ ఇస్తానని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ లేదా జనవరికి ఆలియా కి సంబంధించిన సీన్స్ అన్ని కంప్లీట్ చేయాలని రాజమౌళికి చెప్పిందట. అందుకు కారణం ఇప్పటికే ఆలియా కొన్ని బాలీవుడ్ సినిమాలు కమిటయి, ఆ సినిమాలకి డేట్స్ ఇవ్వడమే అని తెలుస్తుంది. ఆలియా ఇలా కండీషన్ పెట్టడంతో ఎన్టీఆర్.. 'కొమరం భీమ్' టీజర్ మీద ఎఫెక్ట్ పడుతుందని అభిమానులు ఆలియా భట్ పై తీవ్ర స్థాయిలో మండిపతున్నారు. మరి దీనికి మన జక్కన్న,మరో పద్ధతి ఏదైనా అమలు చేస్తాడా అనేది చూడాలి.