విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ నిర్మాణ సంస్థ ....కారణం ఇదే..?

VAMSI
విజయ్ దేవరకొండ.... నేటి తరం మన్మధుడు.. ఈ పేరు వినగానే యువత కళ్ళల్లో మెరుపులు, సినిమా హాల్ లో అరుపులు మామూలే, అంతగా ఆకట్టుకున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ లవర్ అయిపోయాడు విజయ్ దేవరకొండ... ఈ యంగ్ హీరోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొందరు దర్శకులు విజయ్ కోసం ప్రత్యేక కథలు రాసి మరీ ఈ యంగ్ హీరోతో సినిమాలు తీస్తున్నారు. ఈ రొమాంటిక్ హీరో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు. అటువంటి క్రేజ్ ఉన్న ఈ యువతార విజయ్ దేవరకొండను అడ్డం పెట్టుకుని తప్పుడు ఆడిషన్స్ నిర్వహించింది ఓ నిర్మాణ సంస్థ... ఇంకేముంది తన సినిమా అంటూ ఆడిషన్స్ జరిగాక విజయ్ కి తెలియకుండా ఉంటుందా..... ఎలాగోలా తెలిసిపోయింది.

డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ పేరు వినియోగించుకొని, కొందరు వ్యక్తులు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామంటూ టాలీవుడ్   హీరోయిన్లను సంప్రదించారు. వారు ఆలోచిస్తామని చెప్పగా... లేదు లేదు ఇప్పటికే విజయ్‌ తమ సినిమాకు సైన్ చేశారని, ఇక మీరు కూడా ఒప్పుకోవాలని వారిని ఫోర్స్ చేశారు. అయిత మొదట హీరో విజయ్ దేవరకొండ పక్కన చేసే అవకాశం వచ్చినందుకు ఒకే అనుకున్నా... ఓసారి క్లారిటీగా నిర్ధారించుకునేందుకు.. వారు విజయ్‌ టీం ని కలిసి ఈ విషయం చెప్పారు. ఈ విషయం విన్న వారు, అటువంటిదేమీ లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ‘‘విజయ్‌ చేసే నూతన సినిమాల అప్‌డేట్స్‌ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు. మీరు విన్న ఈ వార్త నిజం కాదు.... సదరు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటాం’’ అని ఇటీవల విజయ్‌ బృందం ప్రకటన విడుదల చేసింది.

కాగా చివరికి  విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తూ, ఆడిషన్స్‌ నిర్వహించిన తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ క్షమాపణలు తెలిపింది. నిజానికి తమ సంస్థ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాకం వల్ల నిర్మాణ సంస్థ పేరు బయటకు వచ్చిందే తప్ప.. ఇందులో మా జోక్యం లేదని తెలిపింది. వెంటనే వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: