డ్రగ్స్ కేసులో మరో సినీ జంటకు నోటీసులు జారీ.....

VAMSI
టాలీవుడ్, హాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.... అన్ని రంగాలలో చాలామంది నటీనటులకు డ్రగ్స్ మాఫియా దందాలకు సంబంధమున్నట్లు ఇప్పుడిప్పుడే బయట పడుతోంది..... కొందరు సెలబ్రిటీలు ఫిట్ గా ఉండడానికి తరచూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు కూడా విన్నాం.... రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసుకు డ్రగ్స్ కోణం లింక్స్ ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే.... అయితే ఇప్పుడు తాజాగా  శాండిల్ వుడ్ సినీ పరిశ్రమలో ఈ డ్రగ్స్ కోణం కలకలం సృష్టిస్తోంది.....


ఈ కేసులో ‘కన్నడ నాట’ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వేగాన్ని మరింత పెంచి లోతైన పరిశీలన పై దృష్టి సారించింది.  ఈ కేసుకు సంబంధించి ఇంద్రిత రే, దిగంత్ అనే నటీనటులకు సమన్లు పంపినట్టు పోలీసులు వెల్లడించారు. వీరు రేపు తమ ముందు హాజరు కావాలని గడువు పెట్టి  ఈ సమన్లలో కోరామనన్నారు. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు దివంగత మాజీమంత్రి  జీవరాజ్ ఆల్వా.. భార్య నందిని ఆల్వా పేరిట బెంగుళూరులోని హెబ్బల్ లేక్ వద్ద ఐదెకరాల స్థలంలో గల రిసార్ట్, హోటల్ పై మంగళవారం పోలీసులు  రైడ్ చేశారు. ఆధారాల కోసం క్షుణ్ణంగా సోదాలు  గా నిర్వహించారు.


 ఈ డ్రగ్స్ కేసులో మరో నిందితుడైన ఆదిత్య ఆల్వా ను ఇంకా అరెస్టు చేయవలసి ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే నిజానికి ప్రభుత్వం దృష్టిలో ఈ రిసార్టును మూసివేశారని, ట్రేడ్ లైసెన్స్ ను రెన్యువల్ చేయకపోయినా ఇంకా అనధికారికంగా ఈ రిసార్టును వినియోగిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని వారు తెలిపారు. కాగా డ్రగ్స్ సరఫరా విషయంలో ఈ రిసార్ట్ కేంద్రంగా ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.... అయినా చట్టం నుండి తప్పించుకోవడం అంత సులువు కాదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: