మహేష్ తీసుకున్న ఆ నిర్ణయం .... నిజంగా శభాష్ అనేలా అంటున్నారు .....??

GVK Writings
సీనియర్ లెజెండరీ యాక్టర్ నట శేఖర కృష్ణ వారసుడిగా చిన్నతనంలోనే బాలనటుడిగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ వయసులోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, ఆ సినిమాతో పెద్ద సక్సెస్ ని అందుకుని తొలి సినిమాతోనే తండ్రి కృష్ణకు తగ్గ తనయుడిగా రుజువు చేసుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన మహేష్, తన కెరీర్ లో మొత్తంగా 26 సినిమాల్లో నటించారు.  
తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న మహేష్, స్టార్ హీరోగా ప్రస్తుతం అత్యద్భుతమైన క్రేజ్ తో కోట్లాదిమంది అభిమానుల మనసుల్లో గొప్ప పేరు దక్కించుకున్నారు. ఇక ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకున్న మహేష్, అతి త్వరలో సర్కారు వారి పాట సినిమాలో నటించనున్నారు. కాగా కొన్నేళ్ల క్రితం శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టిన మహేష్, అక్కడి నుండి మధ్యలో తాను నటిస్తున్న సినిమాలకు తన సొంతం సంస్థైన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ని కూడా భాగస్వామిగా చేస్తూ వస్తున్నారు. ఇక అతి త్వరలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట మూవీ లో కూడా మహేష్ భాగస్వామిగా ఉన్నారు.  
అయితే ఇది ఒక్కటే కాదని, ఇకపై దాదాపుగా తాను నటించే చాలా వరకు సినిమాల్లో తాను కూడా ఒక భాగస్వామిగా ఉండేలా భార్య నమ్రతతో కలిసి ప్లాన్ చేస్తున్నారట మహేష్. ఆ విధంగా చేయడం వలన నిర్మాణ ఖర్చుల్లో కొంత మొత్తం భారం ఆయా సినిమాల నిర్మాతలకు తగ్గడంతో పాటు ఒకవేళ ఏదైనా సినిమా పెద్దగా సక్సెస్ కానప్పుడు తద్వారా వచ్చే నష్టాలను తాను కూడా కొంత భర్తీ చేయాలనేది మహేష్ ఆలోచనట. తన సొంత బ్యానర్ ని కూడా తన సినిమాల్లో భాగస్వామిని చేయడం ద్వారా సూపర్ స్టార్ మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా శభాష్ అనేలా ఉందని, టాలీవుడ్ లోని ఇతర హీరోలు కూడా ఇదే పంథా తో కొనసాగితే నిర్మాతలకు కొంత మేర భారం తగ్గే ఛాన్స్ ఉటుందని అంటున్నారు పలువురు విశ్లేషకులు ....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: