నేచురల్ బ్యూటీ క్రేజ్ తగ్గుతోందా..?

NAGARJUNA NAKKA
సాయిపల్లవి లక్కీ హీరోయిన్‌. పట్టిందల్లా బంగారమే అని మొదట్లో తెగ ప్రశంసించారు. ఇలా ఆకాశానికి ఎత్తేసినవాళ్లే ఆమెకు రెండు ఫ్లాపులు పడేసరికి అన్‌లక్కీ హీరోయిన్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. డ్యాన్స్‌లో పెర్‌ఫార్మెన్స్‌లో ఇప్పటి స్టార్స్‌కు మించిన టాలెంట్‌ ఉన్న  సాయిపల్లవి ఎందుకు వెనుకపడిపోయింది? క్యారెక్టర్‌ మాత్రమే చూసుకుని.. కథను పట్టించుకోకపోవడంతో  సాయిపల్లవి కెరీర్‌ అడ్డం తిరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మలయాళం.. తమిళంతోపాటు.. సాయిపల్లవి తెలుగు ప్రయాణం కూడా సక్సెస్‌తో మొదలైంది. తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో.. ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేసి.. క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఫిదా..ఎంసీఎ వంటి వరుస హిట్స్‌తో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్ అనిపించుకుంది సాయిపల్లవి. అయితే ఆతర్వాత నటించిన కణం.. పడి పడిలేచెమనసు ఫ్లాప్‌ అయ్యాయి. తమిళంలోనూ ఇదే పరిస్థితి. ధనుష్‌తో జతకట్టిన మారి2.. సూర్యాతో నటించిన ఎన్‌జికె సక్సెస్ ఇవ్వలేదు.

సినిమా కథ.. ముఖ్యంగా తన పాత్ర నచ్చితేగానీ.. సినిమా ఓకె చేయదు సాయిపల్లవి. ఇలా మనసును మెప్పించని చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను వదిలేసుకుంది. పోనీ ఎంచుకున్న సినిమాలైనా హిట్ అవుతున్నాయా అంటే అదీ లేదు. కథను జడ్జ్ చేయలేక... ఏరికోరి ఫ్లాప్ అయ్యే మూవీస్‌నే ఎంచుకుంది ఈ డాక్టరమ్మ.

పడిపడి లేచెమనసు తర్వాత గ్యాప్ తీసుకున్న సాయిపల్లవి ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమాలో రానాతో... లవ్‌స్టోరీలో నాగచైతన్యతో నటిస్తోంది. ఫిదాతో అదిరిపోయే హిట్‌ ఇచ్చిన శేఖర్‌ కమ్మల దర్వకత్వంలో లవ్‌స్టోరీ చేస్తోంది. కలిసొచ్చిన శేఖర్‌కమ్ముల మరో హిట్‌ ఇస్తాడన్న నమ్మకంతో ఉంది సాయిపల్లవి.

సాయి పల్లవి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినపుడు ఆహా.. ఓహో.. అని ఆకాశానికెత్తేశారు. ఏం నటనా.. ఏం డ్యాన్స్.. ఏం ఆకారం.. ఏం నవ్వు అంటూ.. పొగడ్తల వర్షం కురిపించారు. ఆ ఊపుమీదనే తెలుగు ప్రేక్షకులు ఆ బ్యూటీకి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టారు. ఇపుడేమైందో.. ఏమో గానీ ఆ క్రేజ్ నుంచి ఆ అమ్మడిని దూరం చేస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: