ఎన్నో అవమానాలను భరించాను కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా: హీరో నాని

Suma Kallamadi
మన పక్కింటి కుర్రాడు లాగే కనిపించే హీరో నాని ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగి అందర్నీ ఆశ్చర్యపరిచారు అన్న సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలలో సినిమా పరిశ్రమలో బంధుప్రీతి విపరీత రూపం దాల్చిన నేపథ్యంలో... 2008వ సంవత్సరం లో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలు పడి, భరించలేని అవమానాలను ఎదుర్కొని ఈరోజున టాలీవుడ్ పరిశ్రమలో లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్నారు మన మిడిల్ క్లాస్ అబ్బాయి నాని.

నిజంగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలుకు వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అయితే చాలు ఇక వారి సినిమా కెరీర్ ముగిసినట్టేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కానీ హీరో నాని ప్రతి ఒక్క స్క్రిప్ట్ ని ఎంతో తెలివిగా ఎంపిక చేసుకొని తన సహజమైన నటనతో ప్రేక్షకులను వెండితెరకి కట్టిపడేసారు. అతని సినిమా కెరియర్ లో తెరకెక్కిన దాదాపు అన్ని సినిమాలు కూడా  బాగా అలరించగలిగినవే. అయితే రీసెంట్ గా హీరో నాని నటించిన 25వ చిత్రం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేరుగా ప్రైమ్ వీడియో లో విడుదల కాగా...  మూవీ అస్సలు బాగా లేకపోవడంతో హీరో నాని పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే హీరో నాని మాట్లాడుతూ... నేను సినిమా రంగంలో అడుగు పెట్టినప్పుడు ఎన్నో అవమానాలను చవి చూశాను. కానీ సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగాలంటే అడ్డంకులను, అవమానాలను భరించి ముందుకు కొనసాగాల్సి ఉంటుంది. సినిమా పరిశ్రమలో చాలామంది నన్ను అడ్డగోలుగా తిట్టారు. అయినా హీరో అవ్వాలన్న ఒక్క ఆశతోనే అవన్నీ భరించి ముందు అడుగులు వేశాను. ఆ సహనం కారణంగానే ఈ రోజు నేను ఒక హీరో స్థానంలో కొనసాగుతున్నాను. నా కష్టాలకు ప్రతిఫలం అందుకుంటున్నాను', అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరో నాని కూడా బ్యాక్ గ్రౌండ్ లేని అందరి హీరోల లాగానే కనుమరుగవుతారని అందరూ అనుకున్నారు కానీ నాని మాత్రం ఎవరి ఊహలకు అందకుండా స్టార్ హీరో అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: