ట్రిపుల్ ఆర్ గురించి కొత్త విషయాలు..!

NAGARJUNA NAKKA
దర్శక ధీరుడు రాజమౌళి అండ్ టీం చాలా క్లారిటీగా ఉన్నారు. సిట్యువేషన్స్ నార్మల్ గా ఉన్నప్పుడే ‘ట్రిపుల్ ఆర్’ని మళ్లీ సెట్స్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా విషయాలని పక్కనపెట్టి పర్సనల్ లైఫ్ కి సమయం కేటాయిస్తున్నారు. అయితే జక్కన్న అండ్ కో ఎంత సైలెంట్ గా ఉన్నా టాలీవుడ్ లో ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది.

‘ట్రిపుల్ ఆర్’యాక్షన్ సీన్స్ గురించి టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ హిస్టారికల్ డ్రామాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని, హై ఎమోషన్ తో థియేటర్స్ ని ట్రాన్స్ లోకి తీసుకెళ్తాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు తారక్, పులితో తలపడే యాక్షన్ సీన్ హైలైట్ అని వార్తలొస్తే, ఇప్పుడు ట్రైన్ ఛేజింగ్ సీన్ అద్భుతంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు.

మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల నేపథ్యంలో  తెరకెక్కుతోంది ‘ట్రిపుల్ ఆర్’. ఈ వీరులిద్దరూ కలిసి నాటి ప్రజావ్యతిరేకపాలకులపై యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనే ఊహాజనిత కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా. ఇందులో రామ్ చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తోంటే, తారక్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు.

హిస్టారికల్ డ్రామా ‘ట్రిపుల్ ఆర్’లో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా ట్రైన్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అని ఫిల్మ్ నగర్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ సీక్వెన్స్ కోసం 30 రోజుల షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్ గానే కోవిడ్ నుంచి కోలుకున్న రాజమౌళి ఇంకా సెట్స్ కెళ్లడానికి ప్రిపేర్ కాలేదని సమాచారం. పైగా యాక్షన్ సీన్స్ అంటే 100 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. అయితే కోవిడ్ నిబంధనల్లో 40 మెంబర్స్ తోనే షూటింగ్ చేసుకోవాలని ఉంది. సో కరోనా ప్రభావం తగ్గేవరకు ‘ట్రిపుల్ ఆర్’ బ్రేకులోనే ఉండే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: