బాబా భాస్కర్ ని ఇన్సల్ట్ చేసిన సద్దాం హుస్సేన్.. పిచ్చ కుక్కఅని తిట్టిన మాస్టర్..?

praveen
డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కి డాన్స్ మాస్టర్ గానే కాకుండా ఆయన ఆటిట్యూడ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసింది. భాస్కర్ ఏదైనా షో కి వచ్చారు అంటే రచ్చరచ్చ చేసేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే కమెడియన్ గా  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సద్దాం హుస్సేన్.. డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ని ఇన్సల్ట్ చేశాడు. అదేంటి బాబా భాస్కర్ మాస్టర్ ని కమెడియన్ సద్దాం హుస్సేన్ ఇన్సల్ట్ చేయడం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. అదేంటో  తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.



 కమెడియన్ సద్దాం హుస్సేన్ బాబా భాస్కర్ మాస్టర్ ని ఇన్సల్ట్  చేసింది నిజజీవితంలో కాదు అదిరింది షో లో స్కిట్ లో భాగంగా. ఇటీవలే ఈవారం అదిరింది ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ వారం రాబోయే అదిరింది షో లో సద్దాం హుస్సేన్ స్కిట్ లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు బాబా భాస్కర్ మాస్టర్. ఈ నేపథ్యంలో బాబా భాస్కర్ మాస్టర్ పై ఎన్నో పంచులు పేల్చాడు సద్దాం హుస్సేన్. మొదట బాబా  అంటూ పిలవగానే బాబా భాస్కర్ మాస్టర్ వస్తారు... మిమ్మల్ని ఎవరు పిలిచారు... మీరు ఎందుకు వచ్చారు... నేను పిలిచింది  బాబాని అంటూ చెబుతాడు సద్దాం హుస్సేన్.



 ఆ తర్వాత లెట్స్ వెల్కమ్ భాస్కర్ అంటూ పిలవగానే..  బాబా భాస్కర్ మాస్టర్ మరోసారి స్టేజి మీదకి వస్తాడు.. ఏంటి మాస్టర్ మీరు ఎందుకు ఊరికే వస్తున్నారు.. షో  చేసుకోవాలా వద్దా అంటాడు సద్దాం హుస్సేన్. నువ్వే కదరా పిలిచింది అంటూ బాబా భాస్కర్ ప్రశ్నించగా నేను పిలిచింది మిమ్మల్ని కాదు పళ్ళ  భాస్కర్ ని అంటూ చెబుతాడు సద్దాం హుస్సేన్ . ఇక ఇదే క్రమంలో సద్దాం హుస్సేన్ ని  బాబా భాస్కర్ పిచ్చికుక్క అంటూ తిట్టడం కూడా ఉంది. అయితే సద్దాం హుస్సేన్  బాబా భాస్కర్ మాస్టర్ పై ఇలాంటి పంచులు వేయడం పై.. ఆయన అభిమానులు కాస్త హర్ట్  అయినప్పటికీ ఇది స్కిట్ లో భాగంగా అని చివరికి లైట్ తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: