లేట్ అయితేనేమి ..... రిలీజ్ తరువాత లేటెస్ట్ గా సంచలనం సృష్టిస్తాయి కదా  ....??

GVK Writings
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆ తరువాత మరొక్కసారి ఎన్టీఆర్ తో సింహాద్రి మూవీ తీసి పెద్ద విజయం అందుకున్న రాజమౌళి, అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుని, తాను తీసిన ప్రతి ఒక్క సినిమాతో వరుసగా సక్సెస్ లు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా ఆయన తీసిన బాహుబలి రెండు సినిమాలు ఎంతటి అత్యద్బుత విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ పీరియాడికల్ మల్టీస్టారర్ మూవీ తీస్తున్నారు రాజమౌళి.
దాని అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమా చేయనున్నారు. దానికి సంబంధించి ఇటీవల అధికారికంగా ప్రకటన కూడా రావడం జరిగింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్. నారాయణ భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమా పై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక మొదటి నుండి తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా ఎదుర్కొనని రాజమౌళితో సినిమా చేయడం ఒకరకంగా అంత ఈజీ కాదనే అంటారట ఆయనతో పని చేసిన వారు.  
వ్యక్తిత్వంలో ఎంతో మంచి మనిషైన రాజమౌళి, వర్క్ విషయమై మాత్రం పెద్ద పని రాక్షసుడని, అలానే తన సినిమాలకు సంబంధించి ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ ఎంతో జాగ్రత్తగా అలోచించి మరీ తీస్తారని, అందుకే ఆయన సినిమాలు ఎంతో ఆలస్యంగా రూపొందుతాయని వారు అంటారట. అయితే రాజమౌళితో పని చేసిన ప్రతి ఒక్క హీరో చెప్పే మాట ఒక్కటేనని, ఆయనతో చేసే సినిమాలు లేట్ అయినప్పటికీ, రిలీజ్ తరువాత మాత్రం లేటెస్ట్ గా సంచలన విజయాన్ని అందుకుంటాయి కదా, అటువంటి వ్యక్తితో ఎన్ని సార్లు పనిచేయడానికైనా మేము సిద్దమే అని అంటుంటారని పలువురు సినీ విశ్లేషకులు చెప్తున్నారు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: