ప్రభాస్ 'ఆదిపురుష్' లో కైకేయి గా విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఫిక్స్ ..... ??

GVK Writings
హీరో ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది రిలీజైన సాహో సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న ప్రభాస్, ప్రస్తుతం చేస్తోన్న రాధేశ్యామ్ తో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నారు. అందుకే మొదట కథ విని ఓకె చేసిన దగ్గరి నుండి ఈ సినిమా విషయమై ప్రతి అంశంలోనూ ప్రభాస్ ఎంతో కేర్ తీసుకుంటున్నట్లు టాక్. తొలిసారిగా ప్రభాస్ కు జోడీ గా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  
ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత సి. అశ్వినీదత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్ నటించనున్నారు. అలానే ఇటీవల బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ లో కూడా నటించడానికి పచ్చ జండా ఊపారు ప్రభాస్. శ్రీరాముని జీవిత వృతాంత కథగా అత్యున్నత సాంకేతిక విలువలతో హై బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  
కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రధాన పాత్రైన కైకేయి రోల్ లో విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ నటించనున్నట్లు చెప్తున్నారు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారకురాలైన కైకేయి పాత్రకు ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉందని, అటువంటి పాత్రను కేవలం ఐశ్వర్య మాత్రమే చేయగలరని భావించి యూనిట్ ఆమెను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: