రెబల్ కు దెబ్బ మీద దెబ్బ

Prasad
హీరో ప్రభాస్ నటించిన రెబల్ సినిమా గత నెల 28న విడుదల అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెబల్ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. దేశ విదేశాలలో ఈ సినిమా మొదటి రోజునే 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే తరువాత రోజునుంచి రెబల్ సినిమా భారీ కలెక్షన్లు సాధించలేక పోతుంది. దీనికి రెబల్ సినిమాకు టాక్ బాగా రాకపోవడం ఒక కారణం అయితే, తెలుగు సినిమా కలెక్షన్లుకు ఆయవుపట్టైన నైజాం ప్రాంతంలో పరిస్థితులలో బాగా లేకపోవడం మరొక కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ప్రాంతంలో తెలుగు సినిమా ఎక్కవ కలెక్షన్లు సాధిస్తుంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలోనే 200కు పైగా ధియేటర్లు ఉండటం, నైజాం ప్రాంతంలో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తాయి. అయితే, ఇలాంటి ప్రాంతంలో రెబల్ సినిమా విడుదలైన దగ్గర నుంచి పరిస్థితి అనుకూలంగా లేదు. గత నెల 29న వినాయక నిమజ్జనం, 30న తెలంగాణ మార్చ్, అక్టోబర్ 1న తెలంగాన జెఎసి పిలుపుతో బంద్ జరగడం కారణాలతో రెబల్ వసూళ్లు మందగించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి వారంలోనే కలెక్షన్లు రాబట్టుకోవడం ఇప్పటి మార్కెట్ వ్యూహం. దీంతో 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన రెబల్ కు కాలం కలిసి రావడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే, రెబల్ సినిమా యూనిట్ మాత్రం సినిమా విజయంపై చాలా ధీమాగా ఉంది. హీరో ప్రభాస్ కు మాస్ లో మంచి క్రేజ్ ఉందని, రెబల్ పూర్తి స్థాయిలో తెరకెక్కిన మాస్ సినిమా అని, కాబట్టి బి,సి సెంటర్లలో రెబల్ భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని రెబల్ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: