ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటారా?

VAMSI
దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు కి టాలీవుడ్ లో ఒక బ్రాండ్ ఉంది.... తన పాటలకి ఎనలేని క్రేజ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్టార్ డమ్ తెచ్చుకున్నారు డి.ఎస్.పి. ఒకప్పుడు సూపర్ స్టార్ హీరోలందరి సినిమాలకు సంగీత దర్శకుడిగా ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్ గా ఉన్నాడు డి.ఎస్.పి. కానీ ఇప్పుడు కథ మారింది, కాలము మారింది,కానీ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ట్యూన్స్ మారలేదంటున్నారు సినీ ప్రముఖులు...అందుకే ఈయనకు పూర్వంలా ఆఫర్లు రావడం లేదని డైరెక్టర్లు దూరం పెడుతున్నారని దీనికి కారణం, ఒకటి డి.ఎస్.పి తన మ్యూజిక్ తనే రిపీట్ చేస్తున్నాడనే వాదనలు.... ఇంకో పక్క డీఎస్పీ పారితోషకం భారీ స్థాయిలో ఉందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

నిజానికి ప్రస్తుత  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు పుట్టుకొస్తున్నారు.... వీరి మ్యూజిక్ కు మంచి స్పందన వస్తోంది... అటు రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఇక ఇన్ని అవకాశాలు ఉన్న తరువాత డి.ఎస్.పి మాత్రమే నా సినిమాకి కావాలి అనడం దర్శకుడుకి  కొంచెం కష్టమే అవుతుంది..ఒకప్పుడు టాలీవుడ్ రాజ్యాన్ని తన సంగీతంతో ఏలిన డి.ఎస్.పి ప్రస్తుతం అరకొర సినిమాలతో అడ్జస్ట్ అవుతున్నాడనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి...

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డి.ఎస్.పి మరియు తమన్ మధ్య సంగీత రణం నడుస్తుందనే చెప్పాలి...   ఈ మధ్య తమన్ సంగీత దర్శకుడిగా అందిపుచ్చుకున్న సినిమాలు మ్యూజికల్ గా మ్యాజిక్ చేసి హిట్ టాక్ అందుకోవడంతో తమన్ క్రేజ్ పెరిగింది... ఇక అలా వైకుంఠపురం సినిమా పాటలు తమన్ ను అంత ఎత్తులో కూర్చుని పెట్టాయి... ఇలా తమన్ హవా జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన, నితిన్ చిత్రం రంగ్ దే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప సినిమాలు దేవి శ్రీ ప్రసాద్ చేతిలో ఉన్నాయి.అయితే ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి...మరి వీటి తరువాత డి.ఎస్.పి పూర్వవైభవాన్ని మళ్లీ అందుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: