చిరంజీవితో కాజల్.. రెండోసారి లక్కీ ఛాన్స్..!

shami
సౌత్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ క్రేజీ ఛాన్స్ అందుకుంది. ఇప్పటితరం హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ కు రాని ఛాన్స్ కాజల్ కు వచ్చింది. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవితో రెండుసార్లు నటించే ఛాన్స్ అందుకుంది అమ్మడు. చిరు పదేళ్ల తర్వాత చేస్తున్న ఖైది నంబర్ 150 సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకున్నారు కాని ఫైనల్ గా కాజల్ ఛాన్స్ కొట్టేసింది. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా వచ్చిన ఆ సినిమా అమ్మడి కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది.
అప్పటివరకు కెరియర్ లో వెనకపడినట్టుగా అనిపించిన కాజల్ మళ్ళీ ఖైది నంబర్ 150 హిట్ తో ఫాంలోకి వచ్చింది. ఆ సినిమాతో అమ్మడు మళ్ళీ వరుస ఛాన్సులు అందుకుంది. అయితే చిరుతో ఒక సినిమా ఛాన్స్ అందుకోవడమే కష్టం అనుకుంటే అమ్మడికి మరోసారి చిరుతో నటించే ఛాన్స్ వచ్చింది. కొరటాల శివ డైరక్షన్ లో చిరు చేస్తున్న ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడు.
రాం చరణ్ తో నాయక్, గోవిందుకు అదరివాడేలే సినిమాల్లో నటించింది కాజల్. తనయుడి పక్కన హీరోయిన్ గా నటించి ఇప్పుడు తండ్రి సరసన కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకోవడం కొంతమంది హీరోయిన్స్ వల్లే అవుతుంది. అప్పట్లో శ్రీదేవి ఏయన్నార్, నాగార్జున లతో నటించి మెప్పించారు ఇప్పుడు కాజల్ కూడా అలాంటి రేర్ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. చిరుతో రెండు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న కాజల్ సీనియర్ హీరోలకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అయ్యిందని చెప్పొచ్చు.                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: