మాస్ కాదు, అంతకుమించేలా బాలయ్యను చూపిస్తున్న బోయపాటి .....??

GVK Writings
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కిన సినిమా సింహా. 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాగా ప్రభంజనం సృష్టించింది. నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఆ తరువాత మరొక్కసారి బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా లెజెండ్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ ని అందుకుంది. బాలయ్య ఈ సినిమాలో కూడా రెండు క్యారెక్టర్స్ లో నటించారు.  
రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి బాలయ్యతో బోయపాటి తీస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కాగా ఇందులో కూడా బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నారని, అలానే ఆయన సరసన ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల బోయాపాటి ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. ఇక ఆ రెండు పాత్రల్లో ఒక పాత్ర అఘోరా మాదిరిగా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది.  
అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ ఆ పాత్ర మాస్ కాదు, అంతకు మించేలా ఊర మాస్ స్టైల్ లో ఉంటుందని టాక్. ముఖ్యంగా ఆ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేసారని, ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూర్తి చేసిన రెండు షెడ్యూల్స్  ఆ పాత్ర తాలూకువే అని సమాచారం. మొత్తంగా చూస్తుంటే, ముచ్చటగా మూడోసారి బాలయ్య, బోయపాటి ల కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి వారి కాంబోలో హ్యాట్రిక్ సెట్ చేయడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: