అది కృష్ణ, చిరంజీవి  కలిసి చేయాల్సిన సినిమా అట...... అసలు మ్యాటర్ ఏంటంటే .....??

GVK Writings
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ, తొలి సినిమా తేనెమనసులు తో సక్సెస్ అందుకోవడం తో పాటు నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలు అందుకున్న కృష్ణ, హీరోగా ఎన్నో గొప్ప విజయాలు అందుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ గా అత్యున్నత స్థాయికి ఎదిగారు. ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా పరిచయమైన చిరంజీవి, కెరీర్ తొలినాళ్లలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. ఆ తరువాత హీరోగా మారిన చిరంజీవికి అప్పట్లో వచ్చిన ఖైదీ మూవీ పెద్ద కమర్షియల్ సక్సెస్ అందించింది.
అక్కడి నుండి వరుసగా సినిమాలతో ఎన్నో పెద్ద హిట్స్ అందుకున్న చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ గా గొప్ప పేరు గడించారు. కాగా సూపర్ స్టార్, మెగాస్టార్ ఇద్దరూ కలిసి కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ, తోడు దొంగలు సినిమాల్లో నటించారు. అయితే ఆ తరువాత ఎవరికి వారు హీరోలుగా విడిగా సినిమాలు చేస్తూ కొనసాగారు. అయితే 1999లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహం కోసం సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించగా, ఆయన స్నేహితుడి పాత్రలో తమిళ నటుడు విజయ్ కుమార్ నటించారు.
అంతకముందు తమిళ్ లో రూపొందిన ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన అనంతరం, ఈ సినిమాలో విజయ్ కుమార్ పాత్రకు తెలుగులో సూపర్ స్టార్ కృష్ణని తీసుకోవాలని చిరంజీవి అనుకున్నారని అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే కొద్దిరోజుల తరువాత ఆ సినిమా షూటింగ్  జరిగిపోవడం, తమిళ్ లో పోషించిన అదే పాత్రను తెలుగులో కూడా విజయ్ కుమార్ పోషించడం జరిగింది. అయితే అందులో అసలు వాస్తవం ఏంటంటే, ఆ పాత్రకు గాను కృష్ణని తీసుకోవాలని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని అప్పట్లో కృష్ణ, చిరంజీవి ఎవరికి వారు తమ సినిమాలతో బిజీబిజీ గా కొనసాగారే తప్ప, ఆ సినిమా విషయమై వారిమధ్య ఎక్కడగా కూడా ప్రస్తావన రాలేదని, ఆ వార్త పూర్తిగా మీడియా సృష్టే అని తరువాత తేటతెల్లం అయిందట .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: