ఆ సినిమా చేస్తున్న సమయంలో సమంత ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసా .....??

GVK Writings
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత, తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో పాటు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో మాయ చేసిందనే చెప్పాలి. నాగ చైనత్య హీరోగా నటించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. దాని తరువాత దూకుడు, బృదావనం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మరింత మంచి పేరు దక్కించుకున్న సమంతను, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకెళ్లారు.

ఆ తరువాత ఆమెకు టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి దర్సకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో సుదీప్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొత్తంలో మనం కొంత జాగ్రత్తగా గమనిస్తే, సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో సమంత లుక్ లో కొద్దిపాటి మార్పు గమనించవచ్చు. అయితే ఈ విషయమై అప్పట్లో కొన్ని వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఈగ షూటింగ్ మొదలెట్టిన కొద్దిరోజుల తరువాత సమంత ఒకరకమైన చర్మ సంబంధ వ్యాధితో బాధపడ్డట్లు సమాచారం.

అందువలన ఆ సినిమా షూటింగ్ కూడా చాలా రోజులు వాయిదా పడడం కూడా జరిగింది. ఆరోగ్యం కుదుటపడిన తరువాత మళ్ళి షూటింగ్ లో జాయిన్ అయిన సమంత పేస్ లో కొద్దిపాటి మార్పు వచ్చింది. ఆ తరువాత దానిపై వచ్చిన వార్తలకు సమంత సమాధానమిస్తూ, తనకు అరుదైన చర్మ సంబంధ వ్యాధి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను ట్రీట్మెంట్ తీసుకోవడం వలన దాని నుండి బయటపడ గలిగానని ఆమె అన్నారు. అయితే ఆ వ్యాధి బారిన పడినపుడు తాను కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తనకు తోడుగా ఉండి, ఆత్మస్థైర్యాన్ని అందించారని కూడా ఆమె అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: