మెగా డాటర్సా మజాకా.. నిర్మాతగా ఒకరు.. నటిగా మరొకరు.. ఇక రెచ్చిపోవడమే..!

shami

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి క్రియేటివ్ ఫీల్డ్ లో చాలామంది ఉన్నారు. 11 మంది టీం తో క్రికెట్ జట్టుకి సరిపడేంత మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి వచ్చారు.. వస్తున్నారు. ఇక ఇప్పుడు నటించడమే కాదు మిగతా క్రాఫ్ట్స్ లో కూడా మెగా ఫ్యామిలీ విస్తరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మొన్నటిదాకా కాస్టూమ్ డిజైనర్ గా చేయగా లేటెస్ట్ గా నిర్మాత అవతారం ఎత్తింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  

 

ముందుగా సుస్మిత ఓ వెబ్ సీరీస్ స్టార్ట్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ డైరక్షన్ లో ఓ వెబ్ సీరీస్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ఈ వెబ్ సీరీస్ తర్వాత మరో రెండు వెబ్ మూవీస్ ప్లాన్ చేస్తుందట సుస్మిత. ఈ రెండు సినిమాల్లోనూ మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. వెబ్ సీరీస్ లతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నిహారిక సినిమాల్లో మాత్రం సక్సెస్ అవలేదు.

 

అయితే తనకు కలిసి వచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోనే తన యాక్టింగ్ టాలెంట్ చూపించాలని అనుకుంటుంది. ఇప్పటికే సొంతంగా ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేసిన నిహారిక అక్క సుస్మిత ప్రొడక్షన్ లో రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సినిమాల్లో నిహారిక తన సత్తా చాటుతుందని అంటున్నారు. ప్రస్తుతం స్టోరీ ఫైనల్ కాగా డైరక్టర్ కోసం వెతుకుతున్నారట. మెగా డాటర్స్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఒకరు నిర్మాతగా.. మరొకరు నటిగా రెచ్చిపోతారనడంలో సందేహం లేదు.                       
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: