మాటలు వినీ వినీ విసుగొచ్చింది ..... ఈసారి చేతల్లో చూపాలంటున్న మహేష్ ఫ్యాన్స్ ......??
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 1999లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ విధంగా తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగులు ప్రేక్షకులను ఆకట్టుకున్న మహేష్, ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలతో ముందుకు సాగారు. కెరీర్ బిగింగ్ సమయంలో మధ్యలో అక్కడక్కడా కొన్ని ఫ్లాప్స్ చవిచూసిన సూపర్ స్టార్, మరికొన్ని సూపర్ డూపర్ హిట్స్ కూడా అందుకున్నారు.
అయితే కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ బడా దర్శకుడు ఒకరు, మహేష్ బాబు తో చేసిన సినిమా ఒకటి పెద్ద సక్సెస్ కొట్టి, అటు మహేష్ కు, ఇటు ఆ దర్శకుడికి కెరీర్ పరంగా బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం అదే దర్శకుడితో మరొక సినిమా చేసారు మహేష్, అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ ఫలితాన్ని అందివ్వలేదు సరికదా, బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తరువాత నుండి ఇప్పటివరకు ఆ దర్శకుడితో మహేష్ మరొక సినిమా చేయనే లేదు. అయితే సదరు దర్శకుడు మాత్రం ఇటీవల మంచి సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఒకానొక సమయంలో మహేష్ తో ఆ దర్శకుడి సినిమా రాబోతోంది అంటూ గట్టిగా ప్రచారం జరిగిగింది, అయితే అది మాత్రం ఫైనల్ గా సెట్ అవ్వలేదు. ఇక ఆ దర్శకుడు మధ్యలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ, ఈసారి మహేష్ తో చేయబోయే సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు, ఆయన ఫ్యాన్స్ ని కూడా బాగా మెప్పించే సినిమా అవుతుంది అని అన్నారు.
ఇక గత కొద్దిరోజుల నుండి పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, సదరు దర్శకుడితో వచ్చే ఏడాది మహేష్ బాబు సినిమా తెరకెక్కనుందని, ఇప్పటికే ఆ సినిమా కోసం కథ కూడా సిద్ధం చేస్తున్న సదరు దర్శకడు, అతి త్వరలో మహేష్ కు ఆ కథ వినిపించనున్నారని అంటున్నారు. మొదటిగా మహేష్ తో ఆ దర్శకుడు చేసిన మూవీ హిట్ అవ్వగా, రెండవది ఫ్లాప్ అయింది. అయితే మూడవ సారి మా సూపర్ స్టార్ తో సదరు దర్శకుడు చేసే సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని , ఇప్పటికే ఆయన పలు సందర్భాల్లో ఈసారి మహేష్ కు పెద్ద హిట్ ఇస్తాను అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాలి అంటూ, సదరు దర్శకుడిని ఉద్దేశించి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలువురు మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ....!!