సినీ రాజకీయం : 2024 ఆయనే సిఎం.. ఆర్జీవి ఈ మతలబు ఏంటో..?

shami

తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అంటూనే ఆయన మీద ఎటాకింగ్ కి దిగే సంచలన దర్శకుడు ఆర్జీవి చెప్పే మాటల్లో ఏదో వాస్తవం.. ఏది అవాస్తవం అనే విషయాలను సమీక్షించడం కష్టమే. తను ఏం చెప్పినా సరే లాజికల్ గా ఉండే ఆర్జీవి లేటెస్ట్ గా తను తీసిన పవర్ స్టార్ సినిమాలో కొన్ని ప్రశ్నలకు తావిచ్చేలా చేశాడు. పవర్ స్టార్ టైటిల్ పెట్టి.. అదో సినిమాగా ప్రమోట్ చేసిన రాం గోపాల్ వర్మ కేవలం నాలుగైదు ముక్కలను కట్ చేసి ఓ చోట చేర్చినట్టుగా చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది.   

 

తమ హీరోని కించ పరిస్తే ఊరుకునేది లేదని పవర్ స్టార్ ఫ్యాన్స్ వార్నింగులు.. టైటిల్ పోస్టర్ రిలీజ్ అయిన నాటి నుండి ట్రైలర్ రిలీజ్ వరకు వర్మ ఏదో చేసేస్తున్నాడు అన్నట్టుగా నానా హంగామా చేశారు. తీరా సినిమా చూస్తే అసలు విషయం ఏమి లేదని అర్ధమయ్యింది. అయితే చివర్లో ఓ పది నిమిషాల పాటు ఆర్జీవి ఇచ్చిన స్పీచ్ కొందరు తలనొప్పిగా భావించినా అందులో వర్మ చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చెప్పేశాడని కొందరు అంటున్నారు.

            

మెయిన్ పాయింట్స్ ఏంటంటే పవన్ నిజాయితీ పరుడు అని వర్మ కూడా నమ్ముతున్నాడు.. కాబట్టే అతని సినిమాల్లో కూడా అలా చూపించాడు.. పవన్ మూడు పెళ్ళిళ్ల ప్రస్థావన తెచ్చి నాకు అయ్యింది మీకు కాలేదనే ఏడుపా అంటూ డైలాగ్ వేశాడు. చివరి స్పీచ్ లో 2024లో మీరు సిఎం అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికన్నా ముందు సంతోషపడేది నేనే అంటూ చెప్పాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా ఓడిపోవచ్చు.. కాని 2024లో మాత్రం కచ్చితంగా పవన్ సంచలనం సృష్టిస్తాడని వర్మ ఫీలింగ్ అనుకోవచ్చు. చివర్లో పవన్ కళ్యాణ్ అతన్ని కౌగిలించుకోవడం కూడా కొసమెరుపు అని చెప్పొచ్చు. అంతేకాదు పవన్ కు క్లాస్ పీకుతూ సర్.. సర్ అని సంభోదిస్తూ.. పవన్ లేచి వెళుతుండగా కాలుతో తన్నారా.. పొరపాటున తగిలిందా అంటాడు. ఇలాంటివన్ని వర్మ పవన్ మీద చూపిస్తున్న నిజమైన అభిమానమే అనే డౌట్ రాక మానదు. ఏదైమైనా వర్మ ట్వీట్స్ మాత్రమే కాదు.. ఆయన చేసే సినిమాలు.. ఇచ్చే స్పీచ్ లు కూడా అర్ధం చేసుకున్నోడికి అర్ధం చేసుకున్నట్టు అనేలా ఉంటాయని చెప్పొచ్చు.  

                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: