అఫీషయల్ : నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన కింగ్ నాగార్జున .....!!

GVK Writings

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది. అయితే ఆ తరువాత నుండి ఇప్పటివరకు వరుసగా కెరీర్ పరంగా అపజయాలు అందుకుంటున్న నాగార్జున, ప్రస్తుతం బ్రహ్మాస్త్ర అనే బాలీవుడ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శత్వంలో యాక్షన్ బేస్డ్ ఫాంటసీ డ్రామాగా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక దీనితో పాటు ఇటీవల వైల్డ్ డాగ్ అనే యాక్షన్ మూవీ లో కూడా నటిస్తున్న నాగార్జున, ఇందులో ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా కనిపించనున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ‘వైల్డ్ డాగ్’ మూవీకి కిరణ్ కుమార్ మాటలు అందిస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా ఈ ప్రెస్టీజియస్ మూవీ కి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా అందరూ కొత్తవాళ్లతో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆవేశం ఉంది. ఇక దీని తరువాత తన నెక్స్ట్ సినిమాని కాసేపటి క్రితం అనౌన్స్ చేసారు నాగార్జున.  

 

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి, ఇటీవల రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడ వేగా మూవీ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. నేడు ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేసారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు నిర్మాతలు శరత్ మరార్, పుస్కూర్ రామ్మోహన్ రావు, నారాయణదాసు నారంగ్. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: