పాత్ర కోసం తగ్గినా.. క్యారక్టర్ తో నెగ్గే అల్లు అర్జున్

shami

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి నుండి అల వైకుంఠపురములో వరకు కెరియర్ గ్రాఫ్ చూసి అందరు షాక్ అవుతారు. ఎంచుకునే కథలే కాదు ఆ కథల కోసం బన్నీ పడే కష్టం కూడా అదేవిధంగా ఉంటుంది. గంగోత్రి డెబ్యూ మూవీ కాగా ఆ తర్వాత వచ్చిన ఆర్య నుండి తన స్టైల్ తో ఆకట్టుకుంటున్నాడు అల్లు అర్జున్. పాత్రకు తగ్గ రూపంలో మెప్పించే అల్లు అర్జున్ సినిమాలో ఎలాంటి పాత్ర చేసినా సరే దానికి తగిన మేకోవర్ తో కనిపిస్తాడు.   

 

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ సర్ ప్రైస్ చేస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా 7 కిలోల వెయిట్ లాస్ అయినట్టు తెలుస్తుంది. పాత్ర కోసం తగ్గినా క్యారక్టర్ లో నెగ్గడం కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు అల్లు అర్జున్.  

 

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో స్లిమ్ గా కనిపించడానికి ఈమధ్య కేబీఆర్ పార్క్ లో ఉదయాన్నే జాగింగ్ కూడా చేస్తున్నాడు. తన ప్రతి సినిమాతో స్పెషల్ గా కనిపించాలని ప్రయత్నించే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. సినిమా స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సర్ ప్రైస్ ఇస్తుందని అంటున్నారు.                                        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: